విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆ పార్టీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. పులివెందుల సంప్రదాయాన్ని విశాఖకు తీసుకొచ్చారని ఆరోపించారు. చంద్రబాబు పర్యటన విషయాన్ని 10 రోజుల ముందే ప్రకటిస్తే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకుంటామని మంత్రులే ప్రకటిస్తే ఎందుకు వారిని ముందస్తు అరెస్టులు చేయలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, గుడ్లు, టమాటాలు విసిరేందుకు 500 రూపాయల చొప్పున పంచారంటూ... అందుకు సంబంధించిన వీడియోను వర్ల ప్రదర్శించారు.
'చెప్పులు, గుడ్లు విసిరేందుకు రూ.500 చొప్పున ఇచ్చారు' - వైకాపాపై మండిపడ్డ వర్ల రామయ్య
చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, గుడ్లు, టమాటాలు విసిరేందుకు 500 రూపాయల చొప్పున పంచారంటూ తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. తెదేపా అధినేత కాన్వాయ్‌ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపాపై మండిపడ్డ వర్ల రామయ్య