విశాఖలో గ్యాస్ లీకేజీ కారణంగా 12 మంది మృతి చెందినా రాష్ట్ర ప్రభుత్వం... ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ఎందుకు సానుకూలతతో వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిలదీశారు. గ్యాస్ లీకేజీకి కారణమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వేలాది మంది బాధపడేలా చేసిన యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో ప్రభుత్వం మిలాఖత్ అయినట్లుగా కనపడుతోందని వర్ల ఆరోపించారు. తీవ్రమైన ఘటనను ప్రభుత్వం తేలికగా తీసుకోవడమేంటని దుయ్యబట్టారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'ఎల్జీ పాలిమర్స్‌తో ప్రభుత్వం మిలాఖత్ అయినట్లుంది'
విశాఖలో విషాదం మిగిల్చిన గ్యాస్ లీకేజీ ఘటనను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఇప్పటి వరకు ఎందుకు ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో ప్రభుత్వం మిలాఖత్ అయినట్లుగా కనపడుతోందని వర్ల ఆరోపించారు.
varla ramiah latest news