ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శిరోముండన బాధితుడికి రక్షణ కల్పించండి: వర్ల రామయ్య - పోలీస్ కమిషనర్​కు వర్ల లేఖ

శిరోముండన బాధితుడికి తగు రక్షణ కల్పించాలని తెదేపా నేత వర్ల రామయ్య విశాఖ పోలీస్ కమిషనర్​కు లేఖ రాశారు. బాధితుడు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయపడుతున్నాడన్న ఆయన.. ప్రాణహాని ఉందని కంగారు పడుతున్నాడని లేఖలో పేర్కొన్నారు.

varla letter
varla letter

By

Published : Aug 31, 2020, 3:53 PM IST

విశాఖ శిరోముండన బాధితుడికి తగు రక్షణ కల్పించాలని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య విశాఖ పోలీస్ కమిషనర్​కు లేఖ రాశారు. గతించిన ఫ్యూడల్ వ్యవస్థ రాష్ట్రంలో మళ్లీ రూపు దాల్చిందని మండిపడ్డారు. అధికార పార్టీ నేత నూతన నాయుడు ఇంట్లో మహిళలు బలహీనవర్గానికి చెందిన యువకుడి శిరోముండనం చేయడం అందుకు నిదర్శనమన్నారు. బాధితుడు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయపడుతున్నాడన్న ఆయన.. ప్రాణహాని ఉందని కంగారు పడుతున్నాడని లేఖలో పేర్కొన్నారు. బాధితుడికి ఏమి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details