యుద్ధ రంగంలో తుపాకులతో కదం తొక్కే అమెరికన్ సైనికులు... సర్కారీ బడుల్లోని చిన్నారులతో ఆటపాటలాడిన దృశ్యాలు విశాఖలో కనువిందు చేశాయి. టైగర్ ట్రయంఫ్ విన్యాసాల్లో పాల్గొనేందుకు జర్మన్ టౌన్ యుద్ధనౌకతో సహా వచ్చిన వారు... సామాజిక పరిశీలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విశాఖ ఆరిలోవలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనం, పరిశీలనా గృహంలో విద్యార్థులతో ఆటలాడారు. పసివాళ్లతో కలిసిపోయి మ్యూజికల్ ఛైర్స్, లెమన్ స్పూన్ లాంటి ఆటలాడుతూ విద్యార్థులకు సరికొత్త అనుభూతులు పంచారు.
సర్కారీ బడుల చిన్నారులతో అమెరికన్ సైనికుల ఆటాపాటా - విశాఖలో అమెరికా సైనికులు తాజా వార్తలు
సర్కారీ బడుల చిన్నారులతో అమెరికన్ సైనికులు ఆడిపాడారు. టైగర్ ట్రయంఫ్ విన్యాసాల్లో భాగంగా విశాఖ వచ్చిన సైనికులు సామాజిక పరిశీలనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోదా మరిచి పసివాళ్లతో సైనికులు మమేకమైపోయారు. విద్యార్థులతో స్నేహంగా.. మ్యూజికల్ ఛైర్స్, లెమన్ స్పూన్ లాంటి ఆటలతో సందడిచేశారు.
games-with-children