ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎగువ సీలేరు రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కష్టమే..! - sileru upper power project latest news

ఎగువ సీలేరు దగ్గర రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు (పీఎస్‌పీ) నిర్మాణం కష్టమే అంటున్నారు అధికారులు. నిర్మాణ వ్యయం భారీగా ఉండటమే కారణమని చెబుతున్నారు. ప్రత్యామ్నాయాలపై ఏపీ జెన్‌కో దృష్టి  సారించింది.

Upper sealer reverse pumping power project
ఎగువ సీలేరు రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కష్టమే..!

By

Published : Jun 9, 2021, 6:52 AM IST

ఎగువ సీలేరు దగ్గర రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు (పీఎస్‌పీ) నిర్మాణ ప్రతిపాదనపై అధికారులు పునరాలోచనలో పడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా ఉండటంతో పాటు కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతులు కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఎగువ సీలేరు దగ్గర 1,350 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్‌పీ ఏర్పాటుకు వ్యాప్కోస్‌ సంస్థ సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేసింది. వ్యాప్కోస్‌ ప్రాథమిక అంచనా ప్రకారం నిర్మాణ వ్యయాన్ని పరిశీలించిన అధికారులు.. ప్రాజెక్టు ఏర్పాటు లాభసాటి కాదని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఏపీ జెన్‌కో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది.

రాష్ట్రంలో 29 పీఎస్‌పీల ఏర్పాటు ద్వారా 32 వేల మెగావాట్ల జల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్‌) అంచనా. సివిల్‌, ఎలక్ట్రోమెకానికల్‌ ఖర్చులు కలిపి మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.5 కోట్ల వరకు వెచ్చిస్తే ప్రాజెక్టు ఏర్పాటు లాభసాటిగా ఉంటుంది. ప్రాజెక్టు ప్రారంభంలో యూనిట్‌ ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నా.. 40 ఏళ్ల చ్కీజీజివిత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే తక్కువ ధరకే విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని నెడ్‌క్యాప్‌ తేల్చింది.

ఎగువ సీలేరు దగ్గర ప్రతిపాదించిన ప్రాజెక్టుపై డీపీఆర్‌ల ప్రకారం మెగావాట్‌కు సుమారు రూ.11 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఈ లెక్కన నిర్మాణ వ్యయం సుమారు రూ.14,850 కోట్లు అవుతుంది. ప్రాజెక్టు ఏర్పాటుకు సుమారు 800 ఎకరాల అటవీ భూమి సేకరించాలి. ఇందుకోసం ఎకరాకు రూ.20 లక్షల చొప్పున రూ.1,600 కోట్లు చెల్లించాలి. దీనికితోడు దట్టమైన అటవీ ప్రాంతం కావటంతో విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతులు రావటంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే విద్యుదుత్పత్తి ప్రారంభం ఆలస్యమై మరింత నష్టపోవాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రత్యామ్నాయ ప్రతిపాదనల పరిశీలన

తక్కువ వ్యయంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉన్న ప్రతిపాదనలను పంపాలని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్‌)ను ఏపీ జెన్‌కో అధికారులు కోరారు. నెడ్‌క్యాప్‌ కడపలోని గండికోట, కర్నూలులోని అవుకు, నెల్లూరులోని సోమశిల, అనంతపురంలోని చిత్రావతి, విజయనగరం చ్కీజిజిల్లాలోని కర్రివలస, కురుకుత్తి, విశాఖలో ఎర్రవరం దగ్గర ప్రాజెక్టుల ప్రతిపాదనలను పంపినట్లు తెలిసింది.

భవిష్యత్తులో వచ్చే పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ తీసుకోవాలంటే గ్రిడ్‌ నిర్వహణకు 2 వేల మెగావాట్ల పీఎస్‌పీల ఏర్పాటు తప్పనిసరి. అవి 2030 నాటికి పూర్తయితేనే పునరుత్పాదక విద్యుత్‌ను అదనంగా తీసుకోవటం సాధ్యమవుతుందని ఒక అధికారి తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు డీపీఆర్‌లను సిద్ధం చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

నేటి నుంచి సమ్మెకు దిగనున్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు

ABOUT THE AUTHOR

...view details