ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెళ్లి ఆపాలనుకుంది.. కానీ ప్రాణం పోయింది... !

Vishakha Bridegroom Death Case: విశాఖ మధురవాడలో వధువు సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్ధారించారు. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు పొగొట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సృజన మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.

Vishakha Bridegroom Death Case
మధురవాడలో వధువు సృజన మృతి కేసు

By

Published : May 23, 2022, 10:17 AM IST

Updated : May 23, 2022, 11:24 AM IST

విశాఖ మధురవాడలో వధువు సృజన మృతి కేసు ఓ కొలిక్కివచ్చింది. పోలీసుల దర్యాప్తులో సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకుందని.. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. సృజన మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. కాల్ డయల్ రికార్డర్​తో నిజాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో సృజన ఇన్​స్టాగ్రామ్​లో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చిందని.. ఊహించని విధంగా మృతి చెందినట్లు విచారణలో ప్రియుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే వ్యకితో సృజన ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి నిరాకరిస్తూ.. ఆమెనూ కొంత సమయం నిరీక్షించాలని మోహన్​ చెప్పాడు. ఈ క్రమంలో ఈనెల 11న మధురవాడలో ఘనంగా పెళ్లి చేసేందుకు అంతా సిద్ధం చేసిన సృజన తల్లిదండ్రులు.. సృజన పెళ్లి పీటలపై స్పృహ కోల్పోవడంతో షాక్​కు గురయ్యారు. ఈ పెళ్లి ఇష్టం లేదని.. ఎలాగైన తనను తీసుకెళ్లిపోమ్మని సృజన కోరిందని.. రెండేళ్ల ఆగాలని కోరినట్లుగా దర్యాప్తులో మోహన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లిని ఎలాగైన ఆపడానికి ట్రై చేస్తానని చెప్పిన సృజన.. వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్​, కాల్ డేటా అన్ని డిలీట్ చేసింది. విష పదార్ధం తినడంతో పెళ్లి రోజు ఆమె ఆరోగ్యం క్షీణించి పెళ్లి పీటలపై కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 12న సృజన మృతిచెందిన విషయం తెలిసిందే.

ఆమె.. అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసిన విశాఖ పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. సృజన ఫోన్‌లో కాల్‌ డయల్‌ రికార్డర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఈ కేసు వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఇదీ చదవండి:

Last Updated : May 23, 2022, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details