ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు చేశాం: ఎన్‌ఐఏ - nia searches in AP

ఎన్‌ఐఏ
ఎన్‌ఐఏ

By

Published : Apr 1, 2021, 5:18 PM IST

Updated : Apr 1, 2021, 6:07 PM IST

17:17 April 01

తెలుగు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో సోదాలు చేశామని ఎన్‌ఐఏ వెల్లడించింది. ఈ సోదాల్లో 40 సెల్‌ఫోన్లు, 44 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. సోదాల్లో 70 హార్డ్‌డిస్క్‌లు, మైక్రో ఎస్డీ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్న ఎన్‌ఐఏ... 19 పెన్ డ్రైవ్‌లు, ఆడియో రికార్డర్, రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది.

తెలుగు రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో బుధవారం నుంచి సోదాలు చేశామని ఎన్‌ఐఏ వెల్లడించింది. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో సోదాలు చేసినట్టు వివరించింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్‌లోనూ సోదాలు నిర్వహించినట్టు ఎన్‌ఐఏ వెల్లడించింది.

ఈ తనిఖీల్లో... 40 సెల్‌ఫోన్లు, 44 సిమ్ కార్డులు లభించినట్టు తెలిపింది. అలాగే.. 70 హార్డ్‌డిస్క్‌లు, మైక్రో ఎస్డీ కార్డులు తీసుకున్నామన్న ఎన్‌ఐఏ... 19 పెన్ డ్రైవ్‌లు, ఆడియో రికార్డర్, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది.

ఇదీ చదవండి:

కార్పొరేషన్లు, మున్సిపల్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత: జగన్‌

Last Updated : Apr 1, 2021, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details