ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మత్స్య అభివృద్థికి రూ.25 వేల కోట్లు' - Vishaka and Vizianagaram Districts

కేంద్ర మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటించారు. భోగాపురం మండలం బోయపాలెంలోని రొయ్యల పరిశ్రమను ఆయన సందర్శించారు.

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్

By

Published : Sep 6, 2019, 11:38 PM IST

కేంద్ర మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖ, విజయనగం జిల్లాల్లో పర్యటించారు. బోట్లు, హేచరీలు, రొయ్యల చెరువుల యజమానులతో భేటీ అయ్యారు. విశాఖలోని మత్స్యశాఖ సంస్థల అధికారులతో చర్చించిన గిరిరాజ్‌ సింగ్‌... మత్స్యకారుల అభివృద్థికి కేంద్రం రూ.25 వేల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. సముద్రంలోని మత్స్య సంపదను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మరపడవలకు కేంద్రం డీజిల్‌ రాయితీ అందిస్తోందని చెప్పారు.

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్

అనంతరం విశాఖ ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించారు. పూడిమడక, భీమిలి, మంగమారిపేటలలో జట్టీలు నిర్మించాలని ఎమ్మెల్సీ మాధవ్ కేంద్ర మంత్రిని కోరారు. పాక్‌ జైళ్లలో ఉన్న మత్స్యకారులను విడిపించాలని పలు సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. హార్బర్‌లో పారిశుద్ధ్యం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ట్యూనా చేపలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని కోరారు.

ఇదీ చదవండీ... దాడులు చేసి... తిరిగి బాధితులపైనే కేసులా..?

ABOUT THE AUTHOR

...view details