ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హోరాహోరీగా అండర్-19 కబడ్డీ పోటీలు - విశాఖ అండర్-19 కబడ్డీ పోటీల న్యూస్

విశాఖ జిల్లా చోడవరంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 65వ అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నేటితో ముగిశాయి. బాలుర ఫైనల్​​ మ్యాచ్​ విశాఖ-తూర్పుగోదావరి జిల్లా జట్ల మధ్య హారాహోరీగా జరిగింది. ఈ పోటీలో ఒక్క పాయింట్​ తేడాతో విశాఖ జట్టు విజేతగా నిలిచింది.

Under-19 Kabaddi Competitions at visakhapatnam district

By

Published : Nov 1, 2019, 7:44 PM IST

ఉత్కంఠ భరితంగా సాగిన అండర్-19 కబడ్డీ పోటీలు

గత మూడు రోజులుగా విశాఖ జిల్లా చోడవరంలో నిర్వహిస్తున్న 65వ అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నేటితో ముగిశాయి. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ జట్లకు ఎంపిక చేయనున్నందున ఆటగాళ్లు చక్కటి ప్రతిభ కనబరిచారు. బాలుర ఫైనల్​ పోటీ విశాఖ- తూర్పు గోదావరి జిల్లా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ఒక్క పాయింట్​ తేడాతో విశాఖ జట్టు విజయం సాధించింది. అంతే హోరాహోరీగా సాగిన విజయనగరం- కృష్ణాజిల్లా బాలికల జట్టు ఫైనల్​లో విజయనగరం బాలికల జట్టు గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. అనంతరం రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టు ఎంపికను నిర్వహించారు. కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డా. సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details