'ఆధ్యాత్మిక భావాలే ప్రపంచ శాంతికి దోహదం' - viswa vignana vidya adhyadmika peetam
ఆధ్యాత్మిక పరిణితితో కూడిన భావాలు ఉన్నప్పుడు కలిగే జ్ఞానం ప్రపంచ శాంతికి దోహదం చేస్తుందని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో 'మత సామరశ్యం-ప్రపంచ శాంతి' సమావేశం నిర్వహించారు.
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో 'మత సామరస్యం -ప్రపంచ శాంతి' సమావేశంలో పాల్గొన్న ఉమర్ అలీషా... ప్రపంచ శాంతికి ఆధ్యాత్మిక భావాలే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. వేసవిలో మనోవికాసానికి సర్వమతమైన ఆహ్లాద వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక పరిణితితో కూడిన భావాలు ఉన్నప్పుడు కలిగే జ్ఞానం ప్రపంచ శాంతి దోహదపడుతుందన్నారు. డిజిటల్, ఆధునిక ప్రపంచంలో ఎదురవుతున్న అనేక సమస్యలు, సవాళ్లకు పరిష్కార మార్గాలను, ఆచరించాల్సిన జీవన విధానాన్ని వివరించారు. సర్వమతాలకు చెందిన పెద్దలు వేదిక పంచుకున్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. విద్యా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు అలీషా ప్రసంగాన్ని వినేందుకు వచ్చారు.