విశాఖ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నాల్గవ రోజు జరిగిన కచేరీలో 104 మంది కళాకారులు పాల్గొన్నారు. ఉదయం కళాభారతి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ విద్యార్థుల సామూహిక కచ్చేరి శ్రోతలను ఆకట్టుకుంది. నాల్గవ రోజు ఉత్సవాల్లో భాగంగా పది నిమిషాల కచేరీలు, అరగంట్ర కచేరీలు జరిగాయి.
సీనియర్ సంగీత కళాకారుడు ఎస్ఎన్ మూర్తి గాత్ర కచేరి వీనుల విందు చేసింది. కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్మన్ పి.గోపాలరావు, త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కార్యదర్శి జీఆర్కే ప్రసాద్ పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి.