ఓ స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్.. విశాఖలో కలకలం రేగింది. కిడ్నాప్ చేసిన దుండగులు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. దొండపర్తి వద్ద ఉన్న స్థిరాస్తి వ్యాపారితోపాటు అతనితో ఉన్న న్యాయవాదిని కారులో వచ్చి కిడ్నాపర్లు ఆయుధాలు చూపించి బెదిరించారు. వారిద్దరిని భయపెట్టి కారులోకి ఎక్కించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో తిప్పారు. స్థిరాస్తి వ్యాపారి చివరకు భార్య నగలు అమ్మి కిడ్నాపర్లకు డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు బాధితుడు. ఆమె పోలీసులకు సమాచారం అందించారు. ఎలాగోలా పోలీసులు... కిడ్నాపర్లు ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని వెంబడించారు. ఈ క్రమంలో పరవాడ సమీపంలో ఇద్దరినీ వదిలి వెళ్లిపోయారు దుండగులు. కిడ్నాపర్లు వాడిన కారు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉంది. వారిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలించడం సహా నిందితులకు సంబంధించిన వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.
విశాఖలో కిడ్నాప్ కలకలం.. 5 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు
ప్రశాంత నగరంలోకి కిడ్నాపర్లు ప్రవేశించారు. మారణాయుధాలతో ఇద్దరు వ్యక్తులను బెదిరించారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులను చాలాసేపు కారులో తిప్పారు. పోలీసుల రంగ ప్రవేశంతో కంగుతిన్నారు.
two persons kidnapped in vishaka