వినాయక నిమజ్జనంలో అపశ్రుతి... వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి - vizag district crime
21:02 September 10
నిమజ్జనంలో అపశ్రుతి
విశాఖ జిల్లా మాడుగులలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మాడుగుల పట్టణానికి చెందిన దంగేటి వెంకటేష్ (16). పలువురు కుర్రాళ్లు స్థానిక పాలగెడ్డ జలాశయంలో వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్లారు. వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో ఇద్దరు కుర్రాళ్లు ఊబిలో చిక్కుకున్నారు. వెంటనే స్థానిక పశువుల కాపరులు వచ్చి ఓ కుర్రాడ్ని రక్షించారు. మరో కుర్రాడు వెంకటేశ్ కోసం ప్రయత్నించగా... అప్పటికే ఊబిలో చిక్కుకున్న వెంకటేశ్ తనువు చాలించాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నీటిలో మునిగిపోయిన బాలుడి మృతదేహం బయటకు తీశారు.
విజయనగరం జిల్లా రామభద్రపురం జన్నివలసలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి జరిగింది. వినాయక చవితి కోసం అత్తగారి ఊరు జన్నివలస వచ్చిన తిరుపతిరావు చెరువులో మునిగి మృతి చెందాడు.
ఇదీచదవండి.