విశాఖ నగరంలోని శివాజీపాలెం వద్ద దొంగ నోట్లు మార్పిడి చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. సోదాల్లో విష్ణు అనే వ్యక్తి నుంచి సుమారు రూ.7.22 లక్షలు విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా జోన్ ఏసీపీ మూర్తి వివరాలు వెల్లడించారు.
FAKE CURRENCY : నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు అరెస్టు - visakhapatnam crime
విశాఖలో నకిలీ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. దొంగ నోట్లు మార్పిడి చేస్తున్నారన్న సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు.. రూ.7.22 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు అరెస్టు
ఒడిశా, జాజ్పూర్ నుంచి రూ.12 లక్షల నకిలీ కరెన్సీ తీసుకొచ్చి.. ఈశ్వరరావు, విష్ణు అనే ఇద్దరు మార్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇప్పటివరకు రూ.4.77లక్షలు చెలామణి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని వెల్లడించారు. లక్షకు నాలుగు లక్షల నకిలీ నోట్ల చొప్పున బేరం కుదుర్చుకున్నారని ఏసీపీ వివరించారు. విష్ణుపై గతంలో ఇదే తరహా కేసులు ఉన్నాయని, ఈ ఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉందనే వివరాలు సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీచదవండి :