ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో తితిదే దేవాలయం... తుది దశకు నిర్మాణం

విశాఖ రుషికొండలో తితిదే శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తోంది. సాగరతీరానికి ఎదురుగా కొండపై రూ.20 కోట్ల వ్యయంతో తితిదే తలపెట్టిన దేవాయల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఆలయంలో మే నెలలో విగ్రహ ప్రతిష్ట జరగాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు ప్రశాంతం శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నారు.

విశాఖలో తితిదే దేవాలయం...తుదిదశకు నిర్మాణ పనులు
విశాఖలో తితిదే దేవాలయం...తుదిదశకు నిర్మాణ పనులు

By

Published : Aug 17, 2020, 5:38 PM IST

విశాఖ రుషికొండ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న దేవాలయం పనులు పూర్తి కావొచ్చాయి. వాస్తవంగా ఈ ఆలయాన్ని మే 14వ తేదీన విగ్రహ ప్రతిష్ట చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. కొవిడ్ లాక్ డౌన్ వల్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడింది. మళ్లీ విగ్రహ ప్రతిష్టపై తితిదే ప్రకటన చేయలేదు.

దాదాపు రూ.20 కోట్లు పైగా వ్యయంతో దేవాలయాన్ని సాగర తీరానికి ఎదురుగా ఉన్న కొండపై తితిదే నిర్మిస్తోంది. ప్రశాంత వాతావరణంలో.. కొండపై సుందరంగా ఆలయ కాంప్లెక్స్ ను రూపుదిద్దుతున్నారు. వీటిల్లో శ్రీవారి ప్రధాన ఆలయం, ఇరువైపుల దేవేరుల ఆలయాలు నిర్మించారు. కొండపైకి వెళ్లేందుకు రెండు వైపులా ప్రయాణించేలా రోడ్డు నిర్మాణం చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details