ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sreevari temple in Visakha: ఆధ్యాత్మిక సౌరభం.. సాగర తీరాన శ్రీవారి ఆలయం

పచ్చని ఎత్తైన కొండలు.. కనుచూపుమేర నీటితో హోరెత్తిస్తున్న సముద్రం. ఆ కడలి అలల నుంచి వీచే చల్లటి గాలితో పాటు.. వినసొంపైన ఆ శ్రీహరి అష్టోత్తర నామాలతో.. ఆహ్లాదపరుస్తోంది ఆ ప్రాంతం. విశాఖ రుషికొండ సాగర తీరాన తితిదే నూతనంగా నిర్మించిన శ్రీనివాసుని ఆలయం ఈ ప్రకృతి అందాలకు ఆలవాలంగా నిలుస్తోంది.

Srinivasan Temple on Rushikonda
రుషికొండపై శ్రీనివాసుని ఆలయం

By

Published : Aug 5, 2021, 6:18 PM IST

రుషికొండపై శ్రీనివాసుని ఆలయం

విశాఖ రుషికొండ సముద్ర తీరానికి అభిముఖంగా శ్రీనివాసుని ఆలయాన్ని సిద్ధం చేశారు తితిదే అధికారులు. ఈ నెల 8న అంకురార్పణతో ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. 11వ తేదీ విగ్రహ ప్రతిష్ట, 13వ తేది ఉదయం 9.45 నిముషాలకు మహా సంప్రోక్షణ.. సాయంత్రం 4గంటలకు కల్యాణం కార్యక్రమాలను తితిదే నిర్వహిస్తోంది. అలాగే ఈ నెల 13న సీఎం జగన్​ సంప్రోక్షణలో పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సుమారు పదకొండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ఆలయం నిర్మాణమైంది. విశాఖ భీమిలి రహదారి మధ్యలో రుషికొండ వద్ద ఈ వేంకటేశ్వరుని ఆలయానికి ఘాట్ రోడ్ పనులు పూర్తయ్యాయి. స్వామి తిరునామాలు ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. తిరుమల - తిరుపతి శిల్పుల చేతిలో తయారైన చక్కటి శిల్ప సౌందర్యంతో ఆలయం భక్తుల కోసం సిద్ధంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details