విశాఖలోని రుషికొండలో రూ.30 కోట్లతో నిర్మించిన శ్రీవారి ఆలయం పనులను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. శ్రీవారి ప్రధాన అలయం పనులు పూర్తయ్యాయని తితిదే చైర్మన్ వెల్లడించారు. దాదాపు రూ. 30 కోట్ల వ్యయంతో ఆలయ ప్రాంగణం, సిబ్బంది నివాసాలు, ఘాట్ రోడ్, ఇతర సుందరీకరణ పనులు పూర్తి చేస్తున్నామని వివరించారు. మరికొద్ది రోజుల్లోనే ముహుర్తం ఖరారు చేస్తామన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సీఎం సమక్షంలో నిర్వహిస్తామన్నారు.
రుషికొండలో శ్రీవారి ఆలయ పనులను పరిశీలించిన తితిదే ఛైర్మన్ - బుషికొండలో తితిదే ఆలయ పనులు
రుషికొండ పరిసరాల్లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ పనులను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. త్వరలోనే మిగతా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సీఎం సమక్షంలో నిర్వహిస్తామని వెల్లడించారు.
Rushikonda_Srivari_Temple_