కరోనా రక్కసి విద్యావ్యవస్థను అతలాకుతలం చేసింది. మహమ్మారి దెబ్బకు రెండేళ్లుగా విద్యార్థుల చదువు సక్రమంగా సాగలేదు. ఇప్పుడు మళ్లీ బడులు తెరిచినా.. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఇబ్బందులు తొలగలేదు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గొందిమెలక గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు 3 నెలల క్రితం కరోనాతో మృతి చెందారు. పాఠశాలలు పున: ప్రారంభమైనా.. ఈ బడికి మరో ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో 20 రోజులుగా విద్యార్థులు వచ్చి వెనుదిరిగిపోతున్నారు. ఇతర పాఠశాలల్లో చేర్చుదామన్నా.. ధ్రువపత్రాలు ఇచ్చేవారు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
SCHOOLS: మా పిల్లలను చదువుకు దూరం చేయొద్దు..
కరోనా వచ్చి చదువులను అతలాకుతలం చేసింది. కొందరు గురువులను మింగేసింది. ఈ కారణంగా విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. తిరిగి పాఠశాలలు.. పునః ప్రారంభమైనా కొన్ని స్కూళ్లలో కరోనాతో అధ్యాపకులు చనిపోవడంతో ఉపాధ్యాయులు కరవయ్యారు. పునాదుల్లోనే విద్యార్థుల విద్యాభ్యాసాలకు కష్టాలు ఎదురవుతున్నాయి.
ఉపాధ్యాయుడి మృతితో మూతపడిన పాఠశాల
మా గ్రామంలోని గిరిజన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు 3నెలల క్రితం కరోనాతో మృతి చెందాడు. దీంతో స్కూల్ తెరిచేవారు లేకుండాపోయారు. పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు అయినా అధికారులు కొత్త ఉపాధ్యాయుడిని నియమించలేదు. మా పిల్లలకు చదువు దూరం చేయకండి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి.. మా గ్రామ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతున్నాం. -స్థానికుడు
ఇదీ చదవండీ..'9 నెలల్లోనే వైకాపా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత'
Last Updated : Sep 7, 2021, 4:40 PM IST