గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించే జీవో నెంబర్ 3ను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తూ... నేడు ఆంధ్రా, తెలంగాణలోని మన్యం ప్రాంతంలో బంద్ జరుగుతోంది. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో వ్యాపారులు వారి దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.
విశాఖ మన్యం: జీవో నెంబర్ 3 అమలు చేయాలంటూ గిరిజనుల ఆందోళన - visakha agency news
జీవో నెంబర్ 3 రద్దుపై గిరిజనులు తలపెట్టిన బంద్..విశాఖ మన్యంలో విజయవంతంగా జరుగుతోంది. పాడేరులో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు.
విశాఖ మన్యంలో గిరిజనుల బంద్
ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. గిరిజన సాధన కమిటీ బందు పిలుపుతో మన్యంలోని 11 మండలాల్లో బందు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి... రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని గిరిజన జీవో 3 సాధన కమిటీ కోరుతోంది.
ఇదీ చదవండి:దయనీయ పరిస్థితుల్లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు
Last Updated : Sep 29, 2020, 10:40 AM IST