ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రహదారి కోసం గిరిజనుల వినూత్న నిరసన

ఇంకా ఎన్నాళ్లీ డోలీ మోతలు.. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగేది ఎప్పుడు అంటూ పలువురు గిరిజనులు విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద వినూత్న నిరసన తెలిపారు.

tribal-protest-for-the-visakha
రహదారి కోసం గిరిజనుల వినూత్న నిరసన

By

Published : Nov 23, 2020, 4:25 PM IST

Updated : Nov 23, 2020, 5:04 PM IST

విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద గిరిజన సంఘ యువకులు నిరసనకు దిగారు. నిధులు మంజూరు చేసినా తమ గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రహదారి కోసం గిరిజనుల వినూత్న నిరసన

విశాఖ జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయితీ పరిధిలో పది గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. అయినా సరే వెనకడుగు వేయకుండా శ్రమదానం చేసి రోడ్లు వేసుకున్నారు. ఎన్నో సందర్భాలలో కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధికి మెుర పెట్టుకున్నా తమ గోడు వినలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి 17కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. కానీ రోడ్డు మాత్రం వేయలేదు. ఫలితంగా అనారోగ్యమైనా, గర్భిణీ స్త్రీలకైనా డోలీనే దిక్కయింది. అందుకే ప్రభుత్వానికి తమ గోడు తెలియాలని అనుకున్న గిరిజన యువకులు విశాఖ నగరంలో జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసనకు దిగారు. ఒంటికి ఆకులు కట్టుకుని, డోలీ మోసుకుంటూ విశాఖ రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

Last Updated : Nov 23, 2020, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details