ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ - కొత్తవలస మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ - visakha distrct Latest news

విశాఖ నగరం నుంచి కొత్తవలస మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు అధికారులు పోలీసుల సహాయంతో వ్యవహరించాలని వాహనదారులు కోరుతున్నారు.

Traffic Jam in Visakha-Pendurthy Highway
విశాఖ-కొత్తవలస మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్

By

Published : Oct 21, 2020, 3:39 PM IST

విశాఖ నగరం నుంచి కొత్తవలస మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పెందుర్తి నుంచి కొత్తవలస వెళ్లే రహదారిలో కల్వర్ట్ పనులు జరుగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయ మార్గం గాని, ట్రాఫిక్ మళ్లింపు లేకపోవడం వల్ల ఈ రద్దీ, ఎక్కువ సమయం నిరీక్షణ తప్పడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు మళ్లింపు ఇతర అంశాల్లో అధికారులు స్థానిక పోలీసు సిబ్బంది ఒక ప్రణాళికతో వ్యవహరించక పోవడం వలన భారీగా వాహనాల రద్దీ ఉంది.

పండగ సీజన్ కావడం, వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా వినియోగిస్తున్న తరుణంలో రహదారి పనులు సమయంలో సరైన ప్రత్యామ్నాయ రహదారి లేకపోవడం కారణంగా ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు అధికారులు పోలీసుల సహాయంతో వ్యవహరించాలని వాహనదారులు కోరుతున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఈ రద్దీ బయటి నుంచి వచ్చే వాహనాలతో మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. దీన్ని నియంత్రించేందుకు పక్కాగా ప్రణాళిక అమలు చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details