ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైవాడ జలాశయానికి పోటెత్తిన సందర్శకులు

విశాఖ జిల్లాలోని రైవాడ జలశయానికి పర్యాటకలు పోటెత్తారు. నాగుల చవితి కావటంతో విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు జలశయానికి తరలివచ్చారు. జలశయం అందాలను తిలకించిన పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

revada reservoir
revada reservoir

By

Published : Nov 18, 2020, 11:15 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయానికి సందర్శకులు పోటెత్తారు. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో జలాశయం ప్రధాన గట్టు జనాలతో కిక్కిరిసిపోయింది.

జలాశయం అందాలను తిలకించిన పర్యాటకులు ఆనందంతో సందడిచేశారు. పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావటంతో దేవరాపల్లి నుంచి రైవాడ జలాశయానికి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి :'వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం చేయండి'

ABOUT THE AUTHOR

...view details