- సౌండ్ పెంచితే.. యాక్షన్ తప్పదు: విశాఖ పోలీసులు
Bikes silencers Destroyed : తాము బైక్‌పై వెళ్తే అందరూ తమనే చూడాలనుకుంటుంది యూత్. అందుకు ద్విచక్రవాహనాలకు ఉన్న సైలెన్సర్లను తొలగించి.. సౌండ్ విపరీతంగా వచ్చే సైలెన్సర్లను వినియోగిస్తుంటారు. ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి పెట్టారు. అనేకచోట్ల తనిఖీలు చేపట్టి అలాంటి సైలెన్సర్లను తొలగించారు.. ఈరోజు వాటిని బీచ్‌రోడ్డులో రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు.
- జులై 1 నుంచి ప్రొబేషన్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Probation: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారుపై.. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శుల మూలవేతనం రూ.23,120 నుంచి ప్రారంభమవుతుంది. మిగతా ఉద్యోగుల మూలవేతనం రూ.22,460 నుంచి మొదలవుతుంది. దీనికి కరవుభత్యం, అద్దె భత్యం అదనంగా కలవనున్నాయి.
- యూపీలో యోగి మేజిక్.. ఎస్పీ కోటలు బద్దలు.. పంజాబ్‌లో ఆప్‌కు షాక్
2022 By Polls result: ఉపఎన్నికల ఫలితాల్లో భాజపా విజయఢంకా మోగించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో విపక్ష సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలను బద్దలు కొట్టింది. ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్‌కు అడ్డా అయిన రాంపుర్ పార్లమెంట్ స్థానంలో పాగా వేసింది. మరో పార్లమెంటు స్థానం ఆజంగఢ్‌లోనూ విజయబావుటా ఎగురవేసింది. ఈ విజయాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్.. దిల్లీలోని రాజిందర్ నగర్ స్థానాన్ని గెలుచుకోగా, పంజాబ్‌లో చతికిలపడింది.
- 'పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం మాకివ్వండి'
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదన చేసింది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను కోరింది. ఎన్నికల సంఘానికి ఈ అధికారాన్ని ఇస్తే అక్రమాలకు పాల్పడే రాజకీయ పార్టీలను నిరోధించవచ్చని తెలిపింది.
- మేం బాగా ఆడితే సీనియర్లు తట్టుకోలేరు: పాక్ బ్యాటర్
Pakisthan batter Ahmed Shehzad: పాకిస్థాన్ బ్యాటర్ అహ్మద్ షెజాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒకరు విజయవంతమైతే తమ సీనియర్లు తట్టుకోలేరని, వారు సంతోషంగా ఉండలేరని విమర్శలు చేశాడు. టీమ్ఇండియాలో ధోనీ ఉండటం వల్లే కోహ్లీ బాగా రాణించాడని, కానీ తమ జట్టులో మహీలాగా ప్రోత్సహించే ప్లేయర్స్ లేరని అన్నాడు.
- రష్యా 'బంగారం'పై జీ-7 దేశాల బ్యాన్.. భారత్‌కు లాభమా?
Russian Gold Ban: రష్యా నుంచి ముడిచమురు దిగుమతులపై ఇప్పటికే నిషేధం విధించిన ఐరోపా సహా పలు దేశాలు ఇప్పుడు బంగారంపై దృష్టిసారించాయి. రష్యాను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే దిశగా అమెరికా, ఐరోపా దేశాలు.. రష్యా నుంచి బంగారం దిగుమతులను బ్యాన్ చేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నాయి.
- నైట్ షిఫ్ట్ చేసే మగవారికి ఈ వైద్య పరీక్షలు తప్పనిసరి!
ఆధునికత పెరిగిన కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మారిన ఆహార అలవాట్లు, పెరిగిన కాలుష్యం, ఒత్తిడితో కూడిన జీవితం, పొగతాగడం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా ఆ సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది.
- ఆ షార్ట్‌ఫిల్మ్‌కు 513 అవార్డులు.. గిన్నిస్‌లో చోటు
Manasanamaha guinnes book of world record: యువ దర్శకుడు దీపక్‌రెడ్డి తెరకెక్కించిన లఘు చిత్రం 'మనసానమః' గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. అత్యధిక అవార్డులు అందుకున్న లఘు చిత్రంగా రికార్డు నెలకొల్పింది.