- Amaravati Cases: అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే
రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రాజధాని కోసం జీవనోపాధిని త్యాగం చేసిన రైతులకు.. ప్రభుత్వం ఇచ్చిన హామిలన్నింటినీ నెరవేర్చాలంటూ పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CHANDRABABU NAIDU: 'వెంకన్న ఆశీర్వాదంతో అమరావతే రాష్ట్ర రాజధాని అవుతుంది'
వెంకన్న అశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతి తప్పకుండా దక్కుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతి రైతులు 700 రోజులుగా చేస్తున్న మహోద్యమానికి ఆయన సంఘీభావం తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CPI Ramakrishna: అమరావతి విషయంలో భాజపాది డబుల్ డ్రామా: రామకృష్ణ
రాజధాని అమరావతి రైతులది చరిత్రాత్మక పోరాటమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రైతలు నిరసనలు చేపట్టి 700 రోజులైనా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. అమరావతి విషయంలో భాజపా అధిష్ఠానం డబుల్ డ్రామా ఆడుతోందని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Payyavula: బిడ్డింగ్ లేకుండా 'సెకి' ఆఫర్‌కు ఏకపక్ష అంగీకారమా..? పయ్యావుల లేఖాస్త్రం
రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శికి పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. సెకితో ఒప్పందంపై పలు అంశాలను ప్రస్తావించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- TANA PRESIDENT: 'అమెరికాలో ఏ సాయం కావాలన్నా.. "తానా"ను సంప్రదించాలి'
అమెరికాలోని తెలుగువారి సంక్షేమమే లక్ష్యంగా "తానా" పనిచేస్తుందని.. ఆ సంఘం అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు. అనంతపురం కమ్మభవన్‌లో ఆయనను ఘనంగా సన్మానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాయుసేన సింహగర్జన- హైవేపై యుద్ధవిమానాలతో విన్యాసాలు!
యూపీలో పూర్వాచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధానమంత్రి (PM Modi news) నరేంద్ర మోదీ.. ఎయిర్‌షోను వీక్షించారు. మిరాజ్, సుఖోయ్ సహా పలు యుద్ధ విమానాలు రహదారిపై ల్యాండ్ అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 5 వేల మందికి పురుడు పోసిన నర్స్.. తన వరకు వచ్చే సరికి... పాపం...
సుమారు 5 వేలమందికి పురుడు పోసిన ఓ నర్స్... తన రెండో కాన్పులో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయారు. డెలివరీ ముందు రోజు వరకు ఆమె విధులు నిర్వహించినట్లు స్థానిక వైద్యాధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IND vs NZ: రోహిత్‌కు ద్రవిడ్ బౌలింగ్.. కోచ్‌గా ప్రయాణం షురూ
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid News) పర్యవేక్షణలో.. క్రికెటర్లు తొలిసారి ప్రాక్టీస్ చేశారు. టీ20 కొత్త కెప్టెన్ రోహిత్ శర్మకు బౌలింగ్ చేశాడు ద్రవిడ్. ఇది కొత్త ఆరంభం అంటూ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది బీసీసీఐ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పునీత్ సంస్మరణ సభ.. విచ్చేసిన రాజకీయ ప్రముఖులు, స్టార్ నటులు
ఇటీవల మరణించిన పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళి అర్పిస్తూ.. ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అన్నతో రోజూ కొట్లాటే: మెగాడాటర్ నిహారిక
మెగాడాటర్ నిహారిక బోలెడు సంగతులు చెప్పింది. 'ఆలీతో సరదాగా' షోలో తెగ అల్లరి చేసింది. ఇంతకీ ఏమేం చెప్పిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5PM TOPNEWS