ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @3PM - AP NEWS LIVE UPDATES

.

TOP NEWS
TOP NEWS

By

Published : Dec 14, 2021, 3:01 PM IST

  • Ashokbabu on PRC: జీతాలు పెంచమంటే తగ్గిస్తామంటున్నారు: అశోక్‌బాబు

జీతాలు పెంచమని అడిగితే.. తగ్గిస్తామని అధికారులు చెప్పడం విచిత్రంగా ఉందని అశోక్​ బాబు అన్నారు. తొలిసారి రివర్స్ పీఆర్సీ రాష్ట్రంలోనే చూస్తున్నామని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Pattabhi On Ganta Subbarao Arrest: ఆ రోజు నిజంగా బ్లాక్ డే: పట్టాభి

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ సీఈవో, ఎండీ గంటా సుబ్బారావు అరెస్టైన రోజు నిజంగా ప్రభుత్వానికి బ్లాక్ డే అని తెదేపా నేత పట్టాభి దుయ్యబట్టారు. సీమెన్స్‌ ప్రాజెక్టు వ్యవహారంలో రూ.241 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై సీఐడీ ఆయనను అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Flight Diverted: ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య

సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాజమహేంద్రవరం-తిరుపతి ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. రేణిగుంటకు రావాల్సిన విమానాన్ని అధికారులు బెంగళూరుకు మళ్లించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోతికి నోటితో శ్వాస అందించి ప్రాణాలు కాపాడిన జంతు ప్రేమికుడు

కుక్కల వేటలో గాయపడిన కోతిని రక్షించి గొప్ప మనసు చాటుకున్నాడు తమిళనాడుకు చెందిన వ్యక్తి. శ్వాస తీసుకునే పరిస్థితిలో లేని కోతికి తన నోటితో శ్వాసను అందించి దాని ప్రాణాన్ని నిలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేవెగౌడ కుటుంబం రికార్డు- నాలుగు చట్టసభలకు ప్రాతినిధ్యం

మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం అరుదైన రికార్డు సృష్టించింది. లోక్​సభ, రాజ్యసభతో పాటు రాష్ట్ర ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబంగా ఘనత సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బూస్టర్​ డోస్ అవసరమా? భారత్​లో ఎప్పుడు?.. కేంద్రం జవాబులివే..

బూస్టర్​ డోసుల ఆవశ్యకతకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. బూస్టర్​ డోసు పంపిణీపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని.. దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దక్షిణ కొరియాపై కరోనా పంజా- రోగులతో ఆస్పత్రులు ఫుల్​

దక్షిణ కొరియాలో రోజురోజుకు కొవిడ్​ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కరోనాతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో పడకల్లేక.. పడిగాపులు కాస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెన్షన్‌ ప్లాన్‌ తీసుకుంటున్నారా? ఈ 5 అంశాలు కీలకం!

బాగా సంపాదిస్తున్నప్పుడే రిటైర్మెంట్‌ కోసం పటిష్ఠ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే సుఖప్రదమైన రిటైర్మెంట్‌ జీవితాన్ని అనుభవించగలం. మార్కెట్‌లో రిటైర్మెంట్ ప్లాన్ల పేరిట అనేక పెట్టుబడి పథకాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • PAK vs WI: రికార్డు తిరగరాసిన పాక్.. టీ20ల్లో తొలి జట్టుగా!

వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20 మ్యాచ్​లో పాకిస్థాన్ ఘనవిజయం సాధించింది. ఫలితంగా మూడేళ్ల క్రితం ఆ జట్టు నెలకొల్పిన రికార్డును తానే తిరగరాసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Mahesh Babu surgery: సూపర్​స్టార్​ మహేశ్​కు సర్జరీ.. షూటింగ్​కు బ్రేక్

సూపర్​స్టార్ మహేశ్‌బాబుకు శస్త్రచికిత్స జరిగింది. కొంతకాలంగా ఆయన మోకాలు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల నొప్పి తీవ్రమవడం వల్ల శస్త్ర చికిత్స చేయాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో మహేశ్‌ కుటుంబ సమేతంగా స్పెయిన్‌ వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details