ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది' - tnsf state president latest news

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి, దశ దిశ లేని జాబ్ క్యాలెండర్​ను విడుదల చేసిన సీఎంపై టీఎస్ఎస్​ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్​​ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు.

tnsf
టీఎస్ఎస్​ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు

By

Published : Jun 18, 2021, 7:44 PM IST

ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్​ క్యాలెండర్​ నిరుద్యోగులను నిరాశపరిచిందని టీఎస్ఎస్​ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ అన్నారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తానని.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్​ నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 26,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. జాబ్​ క్యాలెండర్​ ద్వారా అంకెల గారడీ చేశారన్నారు.

ఏపీపీఎస్సీ అవకతవకల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా కొట్టిన చెంపదెబ్బకు జాబ్ క్యాలెండర్​తో ఆయింట్​మెంట్​ రాస్తున్నట్లుగా ఉందని ప్రణవి గోపాల్ ఎద్దేవా చేశారు. కనీస వేతనం లేని వాలంటీర్ జాబ్​లను కూడా, ఉద్యోగాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి, నిరుద్యోగులకు సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గోపాల్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:AP Jobs: జాబ్ క్యాలెండర్​ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!

ABOUT THE AUTHOR

...view details