ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏయూ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి: టీఎన్​ఎస్​ఎఫ్ - ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డిపై ఫిర్యాదు

ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్​(TNSF) డిమాండ్ చేసింది. ఏయూ పేరు, ప్రతిష్టను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న వీసీ​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. విశాఖ 3వ పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

tnsf complaint on auvc
ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డిపై ఫిర్యాదు

By

Published : Jul 13, 2021, 7:20 PM IST

ఆంధ్రా యూనివర్సిటీ(AU) పేరు ప్రతిష్టను నాశనం చేస్తున్న ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్​ డిమాండ్ చేసింది. ఇది ఆంధ్రా యూనివర్సిటీయా..? లేక వైఎస్సార్​ పార్టీ కార్యాలయమో అర్థం కావట్లేదని టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ 3వ పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

వీసీ ప్రసాద్​ రెడ్డికి రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యం ఉంటే తన పదవికి రాజీనామా చేయాలే కానీ వర్సిటీ పేరును నాశనం చేయవద్దని కోరారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న ఆచార్య ప్రసాద్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా.. రెడ్డి సామాజికవర్గ సమావేశంలో పాల్గొన్న ఆచార్య ప్రసాద్ రెడ్డి.. వర్శిటీ పరువు తీశారని.. ఏయూ పేరు, ప్రతిష్టలను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.

వర్సిటీలో కొవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు ఆరేటి మహేశ్ డిమాండ్ చేశారు. ఆచార్య ప్రసాద్ రెడ్డిపై రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి..

రాజధాని రైతులకు ఎన్నారై వైద్యుల అండ.. ఉచిత వైద్యసేవలు

ABOUT THE AUTHOR

...view details