ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగర నగరానికి కొత్తగా ముగ్గురు సబ్​రిజిస్ట్రార్లు...? - మధురవాడ, గాజువాక, ఆనందపురం ఎస్​ఆర్​వోలకు కొత్తగా సబ్​రిజిస్ట్రార్లు

విశాఖలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మార్పులు జరుగనున్నాయి. ఈ శాఖలో పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపగా.. డిప్యుటేషన్ల ద్వారా సాగుతున్న కార్యాలయాలకు శాశ్వత అధికారులు రానున్నారు. మధురవాడ, గాజువాక, ఆనందపురంలకు పూర్తిస్థాయి ఎస్‌ఆర్‌వోలను ప్రభుత్వం నియమించనుంది.

new registrars to visakha
విశాఖ నగరానికి ముగ్గురు కొత్త రిజిస్ట్రార్లు

By

Published : Jan 7, 2021, 5:39 PM IST

విశాఖలోని మధురవాడ, గాజువాక, ఆనందపురం ఎస్‌ఆర్‌వోలకు పూర్తిస్థాయి సబ్‌రిజిస్ట్రార్లు లేరు. ప్రస్తుతం ఈ మూడు చోట్ల డిప్యుటేషన్‌ మీద కొనసాగుతున్నారు. జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్​ గ్రేడ్‌-2 నుంచి గ్రేడ్‌-1 పదోన్నతులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా.. ఈ మూడు ప్రాంతాల్లో ఒకటి, రెండు రోజుల్లో కొత్త అధికారులను నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌లకూ పదోన్నతులు లభించనున్నాయి.

డిప్యుటేషన్​ల మయం:

గతంలో పనిచేసిన మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ను కొద్ది రోజుల కిందటే అమరావతికి సరెండర్‌ చేయగా.. పాలకొండ ఎస్‌ఆర్‌వో రమేష్‌ను ఇక్కడ డిప్యుటేషన్ కింద నియమించారు. గాజువాక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చిన ఎస్‌ఆర్‌వో డిప్యుటేషన్‌ రద్దు చేసి.. సురేశ్‌ అనే ఎస్‌ఆర్‌వోను నియమించారు. ఆర్‌వోలో జాయింట్‌ 1గా పనిచేస్తున్న ఎస్‌ఆర్‌వోను.. ఆనందపురానికి డిప్యుటేషన్​ కింద వేశారు. ఈ ముగ్గురి స్థానంలో శాశ్వత అధికారుల నియామకం జరగనుంది.

అందుకే మంచి డిమాండ్...

రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్యాలయాల్లో.. మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం మొదటివరుసలో ఉంటుంది. ఆ తరువాత గాజువాక , ఆనందపురంలకు ఆ స్థాయి డిమాండ్ ఉంది. ఈ కారణంగా పదోన్నతులు పొందనున్న అధికారులు.. ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఎస్‌ఆర్‌వోలుగా ఇక్కడకు వచ్చేందుకు.. కొందరు రాజకీయ, ఇతర మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

అనిశా తనిఖీలు:

కోటవురట్లలో పనిచేస్తున్న గ్రేడ్‌1 జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఉపేంద్ర.. రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందనున్నారు. గతంలో ఈయన గాజువాక సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సమయంలో అవినీతి నిరోధకశాఖ ఆకస్మిక తనిఖీలు జరిగి.. కోటవురట్లకు డిప్యుటేషన్‌ కింద వెళ్లారు.

ఇదీ చదవండి:

విశాఖ మరింత అభివృద్ధి చెందాలి: హిమాచల్​ గవర్నర్ బండారు

ABOUT THE AUTHOR

...view details