Children Safe: విశాఖ శిశుగృహం నుంచి అదృశ్యమైన చిన్నారులు క్షేమం - విశాఖ జిల్లా తాజా వార్తలు
Children Safe: విశాఖపట్నంలోని శిశు సంక్షేమశాఖకు సంబంధించి శిశుగృహం నుంచి అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. వన్‌టౌన్ ప్రాంతంలోని ఓ పాఠశాల ఎదురుగా చిన్నారులను పోలీసులు గుర్తించారు. అనంతరం శిశు గృహ నిర్వాహకులకు అప్పగించారు.

Children Safe: విశాఖపట్నంలోని స్త్రీ శిశు సంక్షేమశాఖ శిశుగృహం నుంచి అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. మే 4న మహాలక్ష్మి(6) ఏడుకొండలు (4), మరియమ్మ(2) బయట ఆడుకుంటూ అదృశ్యమయ్యారని.. ఎయిర్ పోర్టు పోలీసులకు శిశు గృహ సిబ్బంది ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు.. బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. వన్ టౌన్ ప్రాంతంలోని జీవీఎంసీ పాఠశాల ఎదురుగా చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురినీ శిశు గృహ నిర్వాహకులకు ఎయిర్‌పోర్టు ఎస్ఐ సునీత అప్పగించారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి పద్మావతి, చైల్డ్ లైన్ సభ్యులు చిన్నారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఇదీ చదవండి:ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం.. తల్లి, కుమార్తె మృతి