విశాఖ పైనాపిల్ కాలనీలోని స్వధార్ హోం నుంచి బుధవారం రాత్రి ముగ్గురు యువతులు పరారయ్యారు. మారికవలసకు చెందిన యువతి (21), మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి (19), కాకినాడకు చెందిన యువతి (19) కొంతకాలంగా స్వధార్‌హోంలో ఆశ్రయం పొందుతున్నారు. బుధవారం సాయంత్రం టీ విరామ సమయంలో ముగ్గురూ కనిపించలేదు. వీరి కోసం సిబ్బంది గాలించినా వారి ఆచూకీ లభించలేదు.
Missing : విశాఖలో ముగ్గురు యువతులు మిస్సింగ్... పోలీసుల దర్యాప్తు - vizag crime
విశాఖ(vizag) పైనాపిల్ కాలనీలోని స్వధార్ హోం నుంచి బుధవారం రాత్రి ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు(missing). ఈ ఘటనపై హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారైన యువతులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ ఇమాన్యుల్ రాజు తెలిపారు.
దీంతో ఈ ఘటనపై హోం బాధ్యురాలు రమణికుమారి, పరిశీలానాధికారి సి.హెచ్.నాగేశ్వరి అరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. అదృశ్యమైన యువతుల వివరాలను ప్రధాన కూడళ్లలో అంటించారు. యువతుల వివరాలు తెలిస్తే సమాచారం అందివ్వాలని కోరారు. అదృశ్యం ఘటనపై దర్యాప్తు జరిపేందుకు సిబ్బందిని కేటాయించామని, త్వరలోనే యువతుల ఆచూకీని తెలుసుకుంటామని సీఐ ఇమాన్యుల్ రాజు తెలిపారు.
ఇదీచదవండి.