fishes died: విశాఖ జిల్లా పరవాడ మండలంలోని తిక్కవాణిపాలెం బీచ్లో వేలాది సంఖ్యలో చేపలు మృతి చెందాయి. ఫార్మాసిటీ వ్యర్థాల వల్ల చేపలు చనిపోయాని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. రాంకీ ఫార్మాసిటీకి చెందిన కలుషిత నీటిని వదలడం వల్లే చేపల మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్యాలపాలెం నుంచి సముద్రపు నీరు విడిపోయి తిక్కవానిపాలెం వద్ద ఉప్పుటేరులో కలుస్తుందన్నారు.
Fishes Died: తిక్కవాణిపాలెం బీచ్లో వేలాది చేపలు మృతి...కారణం అదేనా..? - విశాఖ లేటెస్ట్ అప్డేట్
fishes died: పరవాడ మండలంలోని తిక్కవాణిపాలెం బీచ్లో వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. ఫార్మాసిటీ వ్యర్థాల కారణంగా చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
![Fishes Died: తిక్కవాణిపాలెం బీచ్లో వేలాది చేపలు మృతి...కారణం అదేనా..? fishes died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14734180-517-14734180-1647314334955.jpg)
తిక్కవాణిపాలెం బీచ్లో వేలాది చేపలు మృత్యువాత
తిక్కవాణిపాలెం బీచ్లో వేలాది చేపలు మృత్యువాత
fishes died: రాంకీ ఫార్మాసిటీకి చెందిన మెరైన్ అవుట్ ఫుల్ నుంచి కిలోమీటర్ దూరంలో సముద్రంలోకి.. పైపుల ద్వారా వ్యర్థాలను వదులుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎక్కువ శాతంలో వ్యర్థాలను విడుదల చేయడంతో చేపలు మృతి చెందాయని... దీనివల్ల మత్స్య సంపదకు అపార నష్టం కలుగుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: