విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్)లో భారీ క్రేన్ కుప్పకూలి 11 మంది మృత్యువాత పడ్డారు. ఘటనపై తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్(టీఎన్టీయూసీ) నేత రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ చరిత్రలో ఎప్పుడూ ప్రాణనష్టం లేదని చెప్పారు. 75 ఏళ్ల చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రమాదమని తెలిపారు. 75 టన్నుల సామర్థ్యం గల క్రేన్ లోడ్ పరీక్షిస్తుండగా ప్రమాదం జరిగిందని రమణమూర్తి వెల్లడించారు.
'75 ఏళ్ల చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రమాదం' - విశాఖపట్నంలో ప్రమాదం వార్తల
విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో క్రేన్ కూలటంతో 11 మంది మృతి చెందారు. షిప్‌యార్డ్ 75 ఏళ్ల చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రమాదమని టీఎన్టీయూసీ నేత రమణమూర్తి వెల్లడించారు.
accident in the hindustan shipyard