ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవీఎంసీ అభివృద్ధి పనులపై థర్ట్ పార్టీ ఏజెన్సీ నిఘా - జీవీఎంసీ అభివృద్ధి పనులపై థర్ట్ పార్టీ ఏజెన్సీ నిఘా న్యూస్

జీవీఎంసీ చేపట్టే పలు అభివృద్ధి పనులపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక థర్డ్‌పార్టీ ఏజెన్సీని నూతనంగా నియమించేందుకు మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన సిద్ధమయ్యారు. 2020-21, 2021-22 సంవత్సరాలకు గానూ ఈ నియామకాలు జరగనున్నాయి.

జీవీఎంసీ అభివృద్ధి పనులపై థర్ట్ పార్టీ ఏజెన్సీ నిఘా
జీవీఎంసీ అభివృద్ధి పనులపై థర్ట్ పార్టీ ఏజెన్సీ నిఘా

By

Published : Dec 7, 2020, 3:44 PM IST

జీవీఎంసీ చేపట్టే అభివృద్ధి పనులపై ప్రత్యేక థర్డ్ పార్టీ ఏజెన్సీ నిఘా ఉండనుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ టెండర్ల దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రజా పనులు, నిర్మాణ పనులు, ఎలక్ట్రికల్, మెకానికల్, నీటి సరఫరా, ఉద్యాన పనులు, అలాగే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా చేసే కొన్ని ప్రాజెక్టుల్లో కూడా ప్రత్యేక నిఘా పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ బృందంలో 48 మంది సభ్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టతనిచ్చారు. వీరు జోన్ల వారీగా ప్రతి వారం, ప్రతి నెలా, ప్రతి 3 నెలలకోసారి కమిషనర్‌కు నివేదికలు పంపనున్నారు. తదనుగుణంగా అవినీతి జరిగినచోట చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉంటుందని అధికారులు చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details