కరోనాపై వైద్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. విశాఖ వాసికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, ఒంగోలు, విశాఖలో మూడు కేసులు ఉన్నట్లు నిర్ధరించారు. మొత్తం 119 మంది నుంచి నమూనాలు సేకరించగా.. 104 మందికి కరోనా నెగటివ్ వచ్చింది. మరో 12 శాంపిళ్ల కోసం నిరీక్షిస్తున్నారు. విశాఖలో 10, నెల్లూరులో 6, కడపలో 5, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురికి ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరికీ చికిత్స చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 966 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో మూడో కరోనా కేసు... అధికారులు అప్రమత్తం - ఏపీలో మూడో కరోనా కేసు
రాష్ట్రంలో మూడో కరోనా కేసు నమోదైంది. విశాఖ వాసికి కరోనా ఉన్నట్లు వైద్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు, ఒంగోలు, విశాఖలో మూడు కేసులు ఉన్నట్లు ధ్రువీకరించారు.
రాష్ట్రంలో మూడో కరోనా కేసు