విశాఖ జిల్లాలో ఉన్న చారిత్రక, ప్రసిద్ధిగాంచిన బౌద్ధ ప్రదేశాలను పరిరక్షించాలని బౌద్ధ సంఘాలు కోరుతున్నాయి. వాటిని ప్రభుత్వం పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు, వ్యాపార కార్యకలాపాలకు ఇవ్వకూడదని కోరుతూ విశాఖలో బౌద్ధ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తొట్లకొండ చరిత్రను కాపాడాలని కోరుతున్నారు. తొట్లకొండ పరిధి తగ్గించి ప్రభుత్వం చెప్పడం సరికాదని, ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పాటించాలని కోరుతున్నారు.
Thotlakonda : తొట్లకొండ పరిరక్షణకు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి - Historical Buddhist sites in Visakhapatnam district
విశాఖ జిల్లాలో ఉన్న చారిత్రక, ప్రసిద్ధిగాంచిన బౌద్ధ ప్రదేశాలను పరిరక్షించాలని బౌద్ధ సంఘాలు కోరుతున్నాయి. తొట్లకొండ చరిత్రను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బౌద్ధ సంఘాలు
తొట్లకొండను పరిరక్షించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఈ ప్రాంత పరిరక్షణకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు.
ఇదీ చదవండి : Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ 8 గేట్ల వద్ద కార్మికుల నిరసనలు