విశాఖలోని యారాడ దర్గాలో జరుగుతున్న అవకతవకలను వెంటనే అరికట్టి తమకు సేవా హక్కులకు ప్రాధాన్యమివ్వాలని సిద్దిక్ బాబా నియమించిన ప్రథమ సేవకులు ఇవాళ విశాఖలో డిమాండ్ చేశారు. యారాడ దర్గాలో 20 ఏళ్లుగా సేవలు చేస్తున్న తమను బలవంతంగా అక్కడి నుంచి వెళ్లగొట్టి కొందరు అన్యాయంగా దర్గాలో ప్రవేశించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్థానిక వైకాపా నాయకులు, పోలీసులు కొమ్ము కాస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
'యారాడ దర్గాలో అవకతవకలను అడ్డుకోవాలి' - latest news in vishaka district
విశాఖ యారాడ దర్గాలో జరుగుతున్న అవకతవకలను వెంటనే అరికట్టాలని షరీఫ్ సిద్దిక్ బాబా నియమించిన ప్రథమ సేవకులు డిమాండ్ చేశారు. యారాడ దర్గాలో 20 ఏళ్లుగా సేవలు చేస్తున్న తమను అధికార పార్టీ నాయకుల అండదండలతో బలవంతంగా వెళ్లగొట్టేందురకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
యారాడ దర్గా