విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డుల రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయని జీవీఎంసీ కమిషనర్‌కి తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి సూచనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎదురవుతున్న పరిస్థితుల గురించి కమిషనర్‌కు వివరించారు.
'విజయసాయిరెడ్డి సూచనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారు' - జీవీఎంసీ కమిషనర్‌కి తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు న్యూస్
విజయసాయిరెడ్డి ప్రోద్బలంతో జీవీఎంసీ పరిధిలోని వార్డుల రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయని జీవీఎంసీ కమిషనర్‌కి తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎదురవుతున్న పరిస్థితుల గురించి కమిషనర్‌కు వివరించారు.
!['విజయసాయిరెడ్డి సూచనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారు' Telugu_Shakthi_Memorandam_To_GVMC_Commissioner in visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10693977-678-10693977-1613740190159.jpg)
'విజయసాయిరెడ్డి సూచనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారు'
జీవీఎంసీ కమిషనర్ సృజన బదిలీపై వెళ్ళటం.. పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. వైకాపాకు అనుకూలంగా మార్పులు, చేర్పులు చేస్తున్నారని ఈ సందర్భంగా బీవీ రామ్ ఆరోపించారు. గత కమిషనర్ నివేదిక ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. ఇప్పటికైనా దీనిపై పూర్తి నివేదిక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సమర్పించాలని విజ్ఞప్తి చేస్తూ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని బీవీ రామ్ పేర్కొన్నారు.