ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన తెలుగు భాష ఉత్సవాలు - విశాఖపట్నం సమాచారం

విశాఖ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 21 నుంచి 31 వరకు తెలుగు భాష ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు చ్చామని విద్యాశాఖ జిల్లా అధికారి లింగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ప్రతి మండలానికి రూ. 7244 చొప్పున నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. అలాగే 22న వేపగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

Telugu language festivals started in Visakhapatnam
విశాఖలో ప్రారంభమైన తెలుగు భాషా ఉత్సవాలు

By

Published : Dec 22, 2020, 7:18 AM IST

విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి 31 వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలిచ్చామని విద్యాశాఖ జిల్లా అధికారి లింగేశ్వర రెడ్డి చెప్పారు. ప్రతి మండలానికి రూ. 7244 ల చొప్పున నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు.

ఈ నెల 22న వేపగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వ్యాసరచన, గణిత నమూనాల పోటీలు నిర్వహిస్తామన్నారు. గణిత శాస్త్రవేత్త రామానుజన్ జీవిత చరిత్ర పై నిర్వహించే వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు.. ఈ నెల 30న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని డీఈవో వివరించారు.

ABOUT THE AUTHOR

...view details