ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ - telangana governor latest news

విశాఖ శారదా పీఠం వార్షికోత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. శారదాపీఠం ప్రతినిధులు తమిళిసైకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజశ్యామల దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

telangana-governor-visit-sharada-peetham
telangana-governor-visit-sharada-peetham

By

Published : Feb 3, 2020, 5:23 PM IST

Updated : Feb 3, 2020, 6:32 PM IST

శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విశాఖలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. శారదాపీఠ ప్రతినిధులు తమిళిసైకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజశ్యామల దేవికి తెలంగాణ గవర్నర్ పూజలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ సహా.. సభాపతి తమ్మినేని సీతారం, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు కూడా ఈ వార్షికోత్సవాలకు హాజరయ్యారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తమిళిసై

సింహాచలేశుని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్​

సింహాచలం సింహాద్రి అప్పన్నను తెలంగాణ గవర్నర్​ తమిళిసై దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు ఆమెకు స్వామి ప్రసాదాలు అందజేశారు.

ఇవీ చదవండి:

సెలక్ట్ కమిటీకి పార్టీల నుంచి సభ్యుల పేర్లు ఖరారు!

Last Updated : Feb 3, 2020, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details