ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భీమిలిలో తెదేపా కార్పొరేటర్ విజయోత్సవం - విశాఖపట్నం ముఖ్యంశాలు

జీవీఎంసీ పరిధిలోని భీమిలి జోన్ 3వ వార్డు కార్పొరేటర్​గా విజయం సాధించిన తెదేపా నేత గంటా అప్పలకొండను ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు.

భీమిలిలో తెదేపా విజయోత్సవ ర్యాలీ
భీమిలిలో తెదేపా విజయోత్సవ ర్యాలీ

By

Published : Mar 20, 2021, 7:28 PM IST

మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భీమిలి జోన్ 3వ వార్డు కార్పొరేటర్​గా విజయం సాధించిన తెదేపా నేత గంటా అప్పలకొండను ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. తెదేపా రాష్ట్ర కమిటీ, కార్యదర్శి గంటా నూకరాజు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

భీమిలి ప్రజల ఇలవేల్పు నూకాలమ్మ అమ్మవారి దేవాలయం నుంచి గంట స్తంభం, మెయిన్ రోడ్డు మీదుగా చిన్న బజార్ వరకు పెద్దసంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. చిన్నబజార్ జంక్షన్​లో ఎన్టీఆర్ విగ్రహానికి కార్పొరేటర్ గంటా అప్పలకొండ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details