విశాఖలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల కోడ్ను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని తెదేపా ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, బుద్ధ నాగ జగదీశ్వరరావు కోరారు. జిల్లాలోని ఎన్నికల అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా విశాఖలో తెదేపా ఎమ్మెల్సీలు ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు.
'ఏకగ్రీవ పంచాయతీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి' - విశాఖపట్నంతలో తెదేపా ఎమ్మెల్సీల సమావేశం న్యూస్
విశాఖ జిల్లాలో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను తొలగించాలని ఎన్నికల అధికారులకు తెదేపా ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, బుద్ధ నాగజగదీశ్వరరావు కోరారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల కోడ్ను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విశాఖలో తెదేపా ఎమ్మెల్సీలు ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు.
తెదేపా మద్దతు సర్పంచి అభ్యర్థులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడుతూ.. ఏకగ్రీవాలకు ప్రయత్రిస్తున్నారని పప్పల చలపతిరావు, బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. ఏకగ్రీవ పంచాయతీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వైకాపాకు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను తొలగించాలని ఎన్నికల అధికారులను కోరారు.
చాలాచోట్ల సీఎం జగన్, వైకాపా ఫ్లెక్సీలు తొలగించలేదని అన్నారు. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులకు స్పందించడం లేదని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా అధికారులు చూడాలని పేర్కొన్నారు.