మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన అవమానం పట్ల విశాఖలో ఎమ్మెల్యేలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జీవీయంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణబాబులు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన వ్యక్తిని.. సాధారణ ప్రయాణికులు వెళ్లే దారిలో పంపించడం, తనిఖీలు చేయడం దారుణమని అన్నారు. తెదేపా అధినేతకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేస్తే ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి భద్రతను అందించామని గుర్తు చేశారు. నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
బాబు భద్రతపై ఆందోళన... తెదేపా నేతల అర్ధనగ్న ప్రదర్శన - chandra babu security
నిన్న గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును సామాన్య ప్రయాణికుడిలా ట్రీట్ చేయడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖలో తెదేపా ఎమ్మెల్యేలు అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు.
తెదేపా ఎమ్మెల్యేల ఆందోళన