సింహాచల దేవస్థాన భూముల వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు నిరసన చేశారు. విశాఖ పెద్దగదిలి కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేశారు. సింహాచలం భూముల్లో నివాసముంటున్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు.
సింహాచల దేవస్థాన భూములపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 229ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింహాచల దేవస్థానంతో పాటు.. పేదలకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు.