ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భూములు దోచుకోవడానికే విశాఖ రాజధాని' - వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ విమర్శలు

విశాఖలో భూములు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చిందని.. తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఆరోపించారు. విశాఖ పట్టణ తెదేపా అధ్యక్షునిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

tdp mla vaasupalli ganesh criticises ycp government
వాసుపల్లి గణేశ్ కుమార్

By

Published : Jan 31, 2020, 9:43 AM IST

వైకాపాపై తెదేపా ఎమ్మెల్యే విమర్శలు

వైకాపా నేతలు విశాఖలో కడప సంస్కృతిని తీసుకొచ్చారని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ తెదేపా అధ్యక్షునిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు తదితరులు హాజరయ్యారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వైకాపా నేతలు రెచ్చిపోతున్నారని.. విశాఖలో కొనసాగుతోన్న రౌడీ రాజ్యాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అమరావతైనా.. విశాఖ అయినా... కర్నూలైనా.. ఏదో ఒకచోట మాత్రమే రాజధాని ఉండాలన్నారు. భూములు దోచుకోవడమే లక్ష్యంగా విజయసాయిరెడ్డి వారానికి ఒకసారి విశాఖలో పర్యటించి స్థలాలు పరిశీలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరుతో పెట్టుబడులు వెనక్కివెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details