'శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటాం' - viskha latest news
విశాఖ జిల్లా పరవాడలోని రాంకీ సంస్థలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన శ్రీనివాసరావు కుటుంబసభ్యులను తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వర రావు పరామర్శించారు. చంద్రబాబుతో మాట్లాడి పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.
ఇటీవల పరవాడలోని రాంకీ సంస్థలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన శ్రీనివాసరావు కుటుంబసభ్యులను తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వర రావు పరామర్శించారు. ఈ ఘటనలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో వారి పిల్లలు నానమ్మ వద్ద అనకాపల్లి మండలం రాయుడుపేటలో ఉంటున్నారు. ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ పిల్లలతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా వారిని చదివించేలా ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. మృతుడు శ్రీనివాసరావు తెదేపా సానుభూతిపరుడని… చంద్రబాబుతో మాట్లాడి పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.