విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో అనారోగ్యం పాలై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను తెదేపా నేతలు పరామర్శించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్యేలు గణబాబు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, వంగలపూడి అనిత తదితరులు ఆస్పత్రిలో బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదానికి కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మృతుల కుటుంబాలకు పెద్దమొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
'విశాఖ బాధితులకు దీర్ఘకాలిక సమస్యలు లేకుండా చూడాలి' - visakha gas incident news
విశాఖ ఘటనలో బాధితులకు పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన వారు.. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య అందించాలని వైద్యులను కోరారు.
'విశాఖ బాధితులకు దీర్ఘకాలిక సమస్యలు లేకుండా చూడాలి'