విశాఖలో ఎన్టీఆర్కు తెదేపా నేతల నివాళులు - ntr death anniversary news
తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతిని పురస్కరించుకుని విశాఖలో ఆయనకు ఆ పార్టీ నేతలు నివాళులర్పించారు. ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, వాసుపల్లి గణేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం ఎన్టీఆర్ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.