విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను అప్పట్లో తెదేపా రక్షించుకుందని.. రూ.1350 కోట్లు అప్పులు ఉన్నపుడు కూడా బీఐఎఫ్ఆర్కు వెళ్లకుండా తప్పించామని తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. కార్మిక నేతలు నేరుగా ప్రధాని వాజ్‌పేయిని కలిసేటట్లు చేశామని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై ఎవ్వరూ మాట్లాడవద్దని ఎంపీలకు జగన్ సంకేతమిస్తారా.. మన పార్టీ స్టాండ్ తీసుకోలేదని మాట్లాడవద్దని దాటవేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజల గుండెలు మండిపోతుంటే జగన్ మౌనం వహిస్తారా? అని బండారు ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో భూసేకరణ చేశారని.. ముఖ్యమంత్రిగా జగన్‌కు అడిగే హక్కు వుందని పేర్కొన్నారు.
'ప్రజల గుండెలు మండిపోతుంటే.. జగన్ మౌనం వహిస్తారా?' - విశాఖ స్టీల్ ప్లాంట్ న్యూస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెదేపా నేతలు మండిపడ్డారు. ఈ అంశంపై మాట్లాడొద్దని ఎంపీలకు జగన్ సంకేతమిస్తారా? అని బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు.
విశాఖ ప్రజలు ఓటేస్తే గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఒక చరిత్ర వుందని...ఇది తెలుగు ప్రజలతో విడదీయలేని బంధమని ఆమె పేర్కొన్నారు. విశాఖ చరిత్ర తెలిసినవారెవ్వరూ ఇలాంటి నిర్ణయం చేయరని.. రాబంధుల కన్నుపడిందనే అనుమానం కలుగుతోందని అన్నారు. లక్ష కుటుంబాలు స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్నాయని.. దిక్కుమాలిన ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందని అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:పార్టీలకు అతీతంగా విశాఖ నేతలంతా రాజీనామా చేయాలి: గంటా
TAGGED:
విశాఖ స్టీల్ ప్లాంట్ న్యూస్