ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే.. రాష్ట్రపతి పాలన వస్తుంది' - latest news on chandra babu vizag tour

చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిపాలన కొనసాగితే రాష్టంలో రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యం లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

tdp leaders fires on ysrcp
వైకాపా ప్రభుత్వ పాలనపై తెదేపా మండిపాటు

By

Published : Feb 27, 2020, 4:08 PM IST

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేతల మండిపాటు

వైకాపా ప్రభుత్వం చేస్తోన్న కుట్రలు బయటకు వస్తాయనే... చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు కాన్వాయ్‌ని వైకాపా శ్రేణులు అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగటానికి.. విశాఖపట్నం ప్రజలూ మద్దతు తెలుపుతున్నారని దేవినేని అన్నారు.

ఇదే పరిపాలన కొనసాగితే రాష్టంలో రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యం లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అక్రమ అరెస్ట్​లు చేసి అరాచకాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి:

విశాఖ విమానాశ్రయం వద్ద రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details