ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎలాగైనా వెళ్తాం.. ఎలా అడ్డుకుంటారో చూస్తాం' - విశాఖలో చంద్రబాబు పర్యటన వార్తలు

ప్రజాచైతన్య యాత్ర కోసం ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును.... విశాఖ విమానాశ్రయంలో వైకాపా కార్యకర్తలు దిగ్బంధించారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తెదేపా నేతలు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. రౌడీలు, గూండాలను పంపించి దాడి చేయిస్తారా అని నిలదీశారు. బయటికి ఎలాగైనా వెళ్తామని స్పష్టం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఇలా ఆందోళనలు చేయిస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leaders fire on ysrcp in vishaka
tdp leaders fire on ysrcp in vishaka

By

Published : Feb 27, 2020, 1:22 PM IST

.

విశాఖలో వైకాపా తీరును ఖండించిన తెదేపా నేతలు

ABOUT THE AUTHOR

...view details